
తల్లాడ/జూలురుపాడు, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఏన్కూర్ లోని కమ్మవారి కల్యాణ మండపంలో, జూలూరుపాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు.
అనంతరం తిమ్మారావుపేటలో ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్, బొర్రా రాజశేఖర్, ఏన్కూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్యాలాల్ నాయక్, నాయకులు వడ్డే నారాయణరావు,వేముల కృష్ణ ప్రసాద్, స్వర్ణ నరేందర్, మేడ ధర్మారావు, ప్రభావతి రెడ్డి, పంతగాని నరేశ్, పాలెం శేఖర్ ఉన్నారు.