- ఎమ్మెల్యే రోహిత్
- గవర్నమెంట్ మెడికల్ కాలేజీ బిల్డింగ్కు శంకుస్థాపన
మెదక్, వెలుగు: పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణం మెదక్ వైద్య విద్యారంగంలో మరొక మైలురాయి అని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ పట్టణ శివారులోని పిల్లికొటాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఆయన మాట్లాడుతూ.. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.180 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో మెడికల్ కాలేజీ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ అడ్మిషన్లు జరిగాయని పక్కా భవనం నిర్మాణం పూర్తయితే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ప్రాథమిక వైద్యంతో పాటు వైద్య విద్యను అందించేలా మెడికల్ కాలేజీని రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నితిన్ కాబ్రా, సూపరింటెండెంట్ సునీత, డీసీహెచ్ ఎస్ డాక్టర్ శివదయాల్, ఎంసీఏ హెచ్వోడీ రాజశ్రీ పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
పాపన్నపేట: మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ చెప్పారు. మండల పరిధి చీకోడ్, నాగ్సాన్పల్లి గ్రామాల్లో రూ.20 లక్షలతో నిర్మించిన పశు వైద్యశాలలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలన్నారు.
జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటయ్య, పీఆర్ డీఈ పాండురంగారెడ్డి, ఏఈ గోపాల్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, శ్రీకాంతప్ప, శ్రీనివాస్, నరేందర్ గౌడ్, చోటు పాల్గొన్నారు.
శివాజీ విగ్రహ స్థాపనకు రూ.లక్ష అందజేత
మెదక్టౌన్: యువతరం ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే రోహిత్ రావు సూచించారు. మెదక్ మండలంలోని చిట్యాలలో శివాజీ విగ్రహ స్థాపన ఏర్పాటుకు తనవంతుగా రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
