మెదక్టౌన్, వెలుగు: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం కోంటూరు, రాజ్పల్లి, మల్కాపూర్ తండాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ఇందులో భాగంగా కోంటూరు పెద్ద చెరువులో వంద శాతం రాయితీతో 1,84,500 చేప పిల్లలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, గృహలక్ష్మి, మహాలక్ష్మి వంటి పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ప్రశాంత్, డైరెక్టర్ దేవేందర్, అంజయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
