V6 News

అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయండి : ఎమ్మెల్యే రోహిత్ రావు

అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయండి : ఎమ్మెల్యే  రోహిత్ రావు
  •     ఎమ్మెల్యే  రోహిత్ రావు

పాపన్నపేట, వెలుగు: డబ్బు, మద్యానికి ఆశపడి పల్లెలు ఆగం చేసుకోవద్దని, అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలని ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. పంచాయతీ ఎన్నికల  ప్రచారంలో భాగంగా సోమవారం పాపన్నపేట మండల పరిధి గాంధారి పల్లి, జయపురం, అన్నారం, అబ్లపూర్, ఆరెపల్లి, కుర్తివాడ, మిన్ పూర్, రాంతీర్థం, లింగాయి పల్లి, చికోడ్, కొంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలన్నారు.  గ్రామ సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో ఇంకా మూడేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, ఎమ్మెల్యేగా తాను ఉంటానని గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉండదన్నారు. కార్యక్రమాల్లో  జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్  పాల్గొన్నారు.