
జగిత్యాల రూరల్, వెలుగు: నర్సింగ్ కాలేజ్‌లోని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, యాఫీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో శనివారం మ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టూడెంట్స్ సీపీఆర్ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల సమాజానికి చాలా ఉపయోగపడుతుందన్నారు.
అత్యవసర సమయాల్లో చికిత్స చేసి ప్రాణదాతగా మారవచ్చన్నారు. అంతకుముందు నర్సింగ్ కాలేజ్‌లోని డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్, క్లాస్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, సూర్యం, డా. సతీశ్, డా. శ్రీకాంత్, డా. లవ కుమార్ పాల్గొన్నారు.