నారాయణ్ ఖేడ్, వెలుగు: పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ మున్సిపల్ పరిధిలోని చాంద్ ఖాన్ పల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిర మ్మ ఇల్లును లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వడమే కాకుండా అవసరమైన ఇసుకను పంపిణీ చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
