
నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్ పట్టణ శివారులోని వెంకటాపూర్ ఫారెస్ట్ ఆఫీసులో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్లతో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించినప్పుడే మానవుడి మనుగడ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహిళలు ఇందిరా క్రాంతి, డ్వాక్రా గ్రూప్ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. అనంతరం రూ.2 కోట్ల 87 లక్షల రుణాలకు సంబంధించిన చెక్కులను వివిధ మహిళా గ్రూపులకు అందజేశారు. కార్యక్రమంలో ఇందిరా క్రాంతి, డ్వాక్రా మహిళా గ్రూప్ లీడర్లు, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కాంగ్రెస్ లీడర్లు ఆనంద్ స్వరూప్ షెట్కార్, ధారం శంకర్, తహేర్ అలీ, వివేకానంద, పండరి రెడ్డి, రామ కృష్ణ, నరేశ్ యాదవ్, శంకర్ పాల్గొన్నారు.