పుట్టిన రోజు నాడైనా మా సమస్యలను పరిష్కరించరూ..

పుట్టిన రోజు నాడైనా మా సమస్యలను పరిష్కరించరూ..

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌‌కు ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగానైనా తమ జిల్లా సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్‌‌ను ఆమె కోరారు. ‘రెండేండ్ల క్రితం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. కానీ పూర్తిస్థాయిలో పరిపాలనా భవనాల నిర్మాణం, అధికారులు, సిబ్బందిని నియమించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని, గిరిజనుల హక్కులు కాపాడుతామని చెప్పారు. కానీ ఆ హామీలు నెరవేరలేదు. గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయి. ఈ బర్త్ డే సందర్భంగానైనా మా జిల్లా సమస్యలను సీఎం పట్టించుకోవాలి’ అని సీతక్క విజ్ఞప్తి చేశారు.