ఉదయం 4.30 గంటలకు లేచి.. ఇంటింటికీ తిరుగుతూ..

ఉదయం 4.30 గంటలకు లేచి.. ఇంటింటికీ తిరుగుతూ..

ములుగు జిల్లా: ములుగు పట్టణంలో 25 కరోనా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ప్రతి ఒక్కరికీ ధైర్యం చెబుతూ నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. సెకండ్ వేవ్ తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. అందువల్ల ప్రజలందరూ అప్రమత్తం ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సాయం అందించాలని ఆమె కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న కరోనా టెస్టులను  పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. ‘ఉదయం 4.30 గంటలకు నిద్రలేచి, 5.15 గంటలలోగా ప్యాకింగ్ చేసుకొని.. కరోనా పేషంట్ల ఇళ్లకు తిరుగుతూ రాజీవ్ రేషన్ కిట్ అందజేశాం. ఇళ్లుఇళ్లూ తిరుగుతూ పేషంట్లకు ధైర్యం చెబుతూ.. నిత్యావసరాలు సరఫరా చేశాం’ అని ఆమె అన్నారు.