వీడియో: పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా?

వీడియో: పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా?

కరోనా తీవ్రతతో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించారు. అయితే మొదట పదిరోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పదిరోజుల గడువు శుక్రవారం ఉదయంతో ముగియనుండటంతో.. మరో పది రోజులపాటు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇలా పది రోజులు, పది రోజులు పెంచుకుంటూ పేదలను ఇబ్బందిపెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా అని ఆమె ప్రశ్నించారు.

‘పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా? ముఖ్యమంత్రి గారూ. లాక్‌డౌన్ నెల రోజులు విధిస్తే ఎక్కడ ఆరువేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో, పేదలను ఆదుకోవాల్సి వస్తుందోనని చెప్పి.. పది రోజులు, పది రోజులు పొడిగిస్తున్నరు. ఇది కాదు ప్రజలను ఆదుకేనే విధానం. కచ్చితంగా ప్రతి పదిరోజులకు రూ. 1500 ఇవ్వండి. రేషన్ కార్డుతో సంబంధంలేకుండా అందరికీ ఉచితంగా బియ్యం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం’ అని సీతక్క తన ఫేస్‌బుక్ పేజీలో వీడియో పోస్ట్ చేశారు.