సమతామూర్తి పేరుతో చిన్న జీయర్ స్వామి వ్యాపారం

సమతామూర్తి పేరుతో చిన్న జీయర్ స్వామి వ్యాపారం

తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద..  చిన్న జీయర్ స్వామి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సమతామూర్తి పేరుతో 120 కిలోల బంగారు విగ్రహం పెట్టి.. అది చూడటానికి కూడా రూ.150 టికెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సమతామూర్తి పేరుతో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. మా తల్లుల దగ్గర ఎటువంటి టికెట్ లేదు అని, సమ్మక్క సారలమ్మ దగ్గర ఎలాంటి వ్యాపారం జరగదని ఆమె నొక్కివక్కానించారు. లక్ష రూపాయలు తీసుకోకుండా మీరెప్పుడైనా పేద వారి ఇంటికి వెళ్ళారా అని ప్రశ్నించారు. చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.

 

?ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు.. ?మా తల్లుల ది వ్యాపారమా, మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ కానీ మీరు మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు టికెట్ ధర పెట్టారు మీది బిజినెస్ మా సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు.. ?లక్ష రూపాయల తీసుకోకుండా ఏదైనా పేద వారి ఇంటికి మీరు వెళ్ళారా ? ?తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయినా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ ... #seethakka #ironladyoftelangana #chinnajeeyar #chinnajeeyarswami #samathamurthy #telangana #kcr #ktr #RevanthReddy

Posted by Danasari Seethakka on Tuesday, March 15, 2022

For More News..

కలుషిత ఆహారం తిని విద్యార్థినిలకు అస్వస్థత

మహిళల క్రికెట్లో ఝులన్ గోస్వామి కొత్త రికార్డు