థర్డ్ వేవ్‌పై ప్రభుత్వం ముందు జాగ్రత్త శూన్యం

థర్డ్ వేవ్‌పై ప్రభుత్వం ముందు జాగ్రత్త శూన్యం
  • ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్ వేయాలి
  • ఇప్పటికే చాలా నష్టపోయాం.. ఇప్పుడు పిల్లల్ని కోల్పోవాలా? 
  • రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావాలి.. ఎమ్మెల్యే సీతక్క

కరోనా థర్డ్ వేవ్ వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావాలని ఎమ్మెల్యే సీతక్క సూచించారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఆర్థికంగా నష్టపోయామనీ.. సెకండ్ వేవ్‌లో ఎంతోమంది అయినవాళ్లను కోల్పోయామని సీతక్క అన్నారు. ఇప్పుడు రాబోతున్న మూడో వేవ్ వల్ల అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కోల్పోవాలా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లల్ని కాపాడటంలో ప్రభుత్వం ముందుచూపు ఏమాత్రం కనిపించడం లేదని ఆమె ఆరోపించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్, అప్పుడు కొంతమందికి.. ఇప్పుడు కొంతమందికి కాకుండా.. పోలియో చుక్కలు వేసినట్టుగా ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్ వేయాలని సీతక్క డిమాండ్ చేశారు.