టీఆర్ఎస్‌కే ఓటేస్తామని ఓటర్లతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే

టీఆర్ఎస్‌కే ఓటేస్తామని ఓటర్లతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే

నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. పార్టీల అభ్యర్థులతో పాటు.. ఆయా పార్టీల లీడర్లు కూడా అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ తరపున పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరపున తాజాగా అక్కడ ప్రచారం చేస్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేస్తామని ఆయన అక్కడి ఓటర్లతో ప్రమాణం చేయిస్తున్నారు. త్రిపురారం మండలానికి ఇంచార్జిగా ఉన్న శంకర్ నాయక్.. రాజేంద్ర నగర్ గ్రామ శివారు బుడ్డే తండాలో మంగళవారం రాత్రి ప్రచారం చేశారు. తండాలోని సమస్యలు తీరుస్తామని హమీ ఇచ్చారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే తండాలో అందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తండాకు రోడ్లు వేయిస్తామని, చదువుకున్న వారికీ దుకాణాలు పెట్టుకుంటామంటే 5 లక్షల రూపాయల లోన్ ఇప్పిస్తామని నాయకులు హమీ ఇచ్చారు. అనంతరం తండాలోని మొత్తం 294 ఓట్లు కారు గుర్తుకే వేస్తామని సేవాలాల్ పేరు మీద గిరిజనులతో శంకర్ నాయక్ ప్రమాణం చేయించారు. 

https://www.youtube.com/watch?v=Shz1q_WBAik