పద్మారావునగర్, వెలుగు: రసూల్‌పుర గన్‌బజార్ కమ్యూనిటీ హాల్‌లో బుధవారం కంటోన్మెంట్ వాణి నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం ఆధీనంలోని కంటోన్మెంట్, రాష్ట్ర శాఖల మధ్య సమన్వయం లేక అనేక సమస్యలు పేరుకుపోయాయని చెప్పారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్‌కుమార్ ద్వివేది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

