వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు : వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు జరిగాయి. ఎమ్మెల్యే పాల్గొని 112 మహిళా సంఘాలకు రూ.13.49 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఉన్నతికి తోడ్పాటునందిస్తుందన్నారు. మరణించిన సభ్యులకు రూ.40.64 లక్షల బీమా చెక్కులు, మరో నలుగురికి రూ.40 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. 

3896 సంఘాలకు రూ.3 కోట్ల 91 లక్షల వడ్డీలేని రుణాలు (పావలా వడ్డీ), స్త్రీనిధి కింద 632 సంఘాల కు రూ.12.78 కోట్లు చెక్కులను అందించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్,  డీఆర్డీవో  పీడీ సాయాగౌడ్, అసిస్టెంట్ డీఆర్డీవో మధుసూదన్, జిల్లా అధికారులు, ప్రతినిధులు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.  

ఆయిల్ పామ్ సాగు చేయాలి

ఎడపల్లి, వెలుగు : ఆయిల్​పామ్​ పంట సాగు చేసి లాభాలు పొందాలని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ఆయిల్​పామ్​ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.  బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు.  ప్రియునిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు ఆయిల్ పామ్ సాగులో మెలకువలు, నూతన పద్ధతులను ప్రెజెంటేషన్ ఇచ్చారు.  కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, నాయకులు గడుగు గంగాధర్, పులి శ్రీనివాస్, ప్రి యూనిక్ సంస్థ ఏజీఎం మల్లేశ్వర రావు, డైరెక్టర్ పాశం ప్రసాద్ తదితరులు 
పాల్గొన్నారు.