
నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్కిల్ ఇండియాకు ప్రాధాన్యతనిస్తూ యువతకు ఉద్యోగావకాశాలు పెంచుతోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. గురువారం కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి నగరంలోని శివాజీ నగర్ ఐటీఐ కాలేజీ విజిట్ చేసి సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
సాంకేతిక విద్యతో ప్రపంచవ్యాప్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునే వీలుంటుందన్నారు. ఐటీఐ స్టూడెంట్స్‌కు జాబ్స్ ఇచ్చేలా స్టేట్ గవర్నమెంట్ కార్పొరేట్ కంపెనీలను ఒప్పించిందన్నారు. ప్రిన్సిపాల్ యాదగిరి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ తదితరులు ఉన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వద్దు..
బోధన్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపల్ అధికారులకు సూచించారు. గురువారం బోధన్ పట్టణ మున్సిపల్ ఆఫీసులో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని, వంద శాతం ఇంటిపన్నులు వసూలు చేయలన్నారు.
అనంతరం బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హుందాన్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్లు తూము పద్మాశరత్ రెడ్డి, ఆనంపల్లి ఎల్లయ్య, మున్సిపల్ ఏఈలు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.