విద్యారంగ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు  :  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

విద్యారంగ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు  :  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు : విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందని  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఒకేషనల్​ కోర్స్​లో భాగంగా వ్యవసాయ, బ్యూటీషియన్ కోర్స్​లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేసిందన్నారు.  ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తున్నామన్నారు.

 విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, కూరగాయలు, గుడ్లు  తాజాగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. పాఠశాల భవనానికి రంగులు వేయడానికి రూ.లక్ష మంజూరు చేస్తున్నట్టు   ప్రకటించారు. పదో తరగతిలో ర్యాంక్​లు సాధించిన విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ గంగాశంకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, మాజీ జడ్పీ వైస్​ చైర్​ పర్సన్ రజితాయాదవ్,  నాయకులు బిళ్లా రాంమోహన్, శరత్ రెడ్డి,  మల్కారెడ్డి, నగేశ్​రెడ్డి, లింగం, నారాయణ, విజయ్​ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.