చిలప్‌చెడ్, వెలుగు: మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుందని, పోషకాహారం తీసుకుంటేనే ఈ సమస్య అధిగమించవచ్చని ఎమ్మెల్యే సునీతా రెడ్డి చెప్పారు. సోమవారం చిలప్‌చెడ్ జడ్పీ హైస్కూల్లో పోషణ మాసోత్సవం, బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోషకాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.
సంక్షేమాధికారి హేమభార్గవి మాట్లాడుతూ.. సమష్టి కృషితోనే బాల్యవివాహాలు ఆపగలమన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అనంతరం మండలానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్, మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్, ఎస్ఐ నర్సింలు, ఆర్ఐ సునీల్ సింగ్, ఎంపీవో తిరుపతి, ఏపీఎం గౌరీశంకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సంతోషి మాత, సంతోష, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత
మనోహరాబాద్: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సోమవారం గౌతోజిగూడెం తదితర గ్రామాల ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు రేణు కుమార్, పరికిబండ మాజీ సర్పంచ్ అర్జున్, తలారి నర్సింలు, మల్లేశ్ పాల్గొన్నారు.
