రైతుకు భరోసాగా ప్రభుత్వం : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

రైతుకు భరోసాగా ప్రభుత్వం : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

భద్రాచలం, వెలుగు :  వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి రైతులకు కాంగ్రెస్​ ప్రభుత్వం భరోసాగా నిలిచిందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల మండల కేంద్రంలో బుధవారం ఆయన సబ్సిడీపై వచ్చిన యంత్రాలు రోటవేటర్లు, పవర్​ టిల్లర్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్లలో రైతులకు రాయితీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కారు అన్నదాతల కష్టాలను చూసి వారికి వెన్నుదన్నుగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సుధాకర్​, వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ ఇర్పా శ్రీనివాస్​, ఆత్మ చైర్మన్​ ఇందల బుచ్చిబాబు, తహసీల్దారు శ్రీనివాస్​, ఎంపీడీవో ఈదయ్య, ఏవో లావణ్య తదితరులు పాల్గొన్నారు.