విద్యార్థుల భవిష్యత్కు పెద్దపీట : తోట లక్ష్మీకాంతరావు

విద్యార్థుల భవిష్యత్కు పెద్దపీట : తోట లక్ష్మీకాంతరావు
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

పిట్లం, వెలుగు : విద్యార్థుల భవిష్యత్​కు రాష్ట్ర  ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. సోమవారం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పెద్దకొడప్​గల్​ గురుకుల పాఠశాలను సందర్శించి మాట్లాడారు.  విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా రేపటి బంగారు తెలంగాణకు పెట్టుబడిలాంటిదని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించడాన్ని గుర్తు చేశారు.   గురుకుల మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు 40 నుంచి 200 వందల శాతం పెంచినట్లు వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మెగా డీఎస్సీ నిర్వహించి 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. 

విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేసి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మద్నూర్​, బిచ్కుంద,పెద్దకొడప్​గల్​ మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, కొత్త రేషన్​ కార్డులు పంపిణీ చేశారు. జుక్కల్ క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై నియోజకర్గ సమస్యలపై చర్చించారు. బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి, అధికారులు ఉన్నారు.