దళితుల సంక్షేమం కోసం కృషి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

దళితుల సంక్షేమం కోసం కృషి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

 పిట్లం, వెలుగు : దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. శనివారం పిట్లం మార్కెట్ యార్డులో నిజాంసాగర్ మండలానికి చెందిన 11 మందికి దళితబంధు చెక్కులు, కారును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలిపారు.

సంక్షేమంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం బిచ్కుందలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మిచెక్కులను అందజేశారు. జుక్కల్​ మండలం గుల్లా తండాలో ఇటీవల కూలర్ కరెంట్ షాక్​తో తల్లి, కూతురు మృతి చెందగా, బాధిత కుటుంబీకులను పరామర్శించారు.