
- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
పిట్లం, వెలుగు : ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం మద్నూర్‌లో బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముదిరాజ్‌లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సంఘ భవన ప్రహారికి ఎమ్మెల్యే రూ. 20 లక్షలు మంజూరు చేశారు. అంతకుముందు మహర్షి వాల్మీకి విగ్రహ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
రాచూర్‌లో వైద్య శిబిరం..
మండలంలోని రాచూర్ గ్రామంలో గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పరిశీలించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చారు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరిని మద్నూర్ సీహెచ్‌సీ కి పంపించారు.