
పిట్లం, వెలుగు: భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం జుక్కల్ మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని, పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దన్నారు. పంట నష్టం వివరాలను నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.