
అచ్చంపేట, వెలుగు: కృష్ణానది జలాలతో నల్లమల సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. కేఎల్ఐ కాల్వల ద్వారా నియోజకవర్గానికి నీరు వస్తుండడంతో బల్మూరు మండలం గట్టు తుమ్మేన్ శివారులో జలాలకు హారతి ఇచ్చి, పూలు చల్లారు. ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్ల పనులు త్వరలోనే ప్రారంభించి, ఈ ప్రాంతంలోని ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, నాయకులు సలేశ్వరం, సుధాకర్ గౌడ్ , నజీర్, అల్వాల్ రెడ్డి, జమీల్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
వచ్చే నెల 6 నుంచి హెల్త్ క్యాంప్..
నల్లమల పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు వచ్చే నెల 6 నుంచి మూడో విడత మెగా హెల్త్ క్యాంప్నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. సోమవారం అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న వేళ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పేషెంట్లకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మామిళ్లపల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
ఉప్పునుంతల, వెలుగు: మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. సోమవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అన్యాక్రాంతమైన ఆలయ భూములపై చైర్మన్ నరసింహారావు,ఈవో నరసింహ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలక మండలి సభ్యులు స్వరూప రెడ్డి, చలమల గణేశ్గౌడ్, మాజీ ఎంపీపీ అరుణ, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేశ్, మాజీ ఉపసర్పంచ్ మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.