ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ : వెడ్మ బొజ్జు పటేల్

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ : వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉదయం జన్నారం మండల కేంద్రంలోని పలు కాలనీల్లో మార్నింగ్ వాక్ చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించేలా అప్పటికప్పుడు ఆఫీసర్లుకు అదేశాలిస్తూ ముందుకు సాగారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అవసరమున్న చోట బోర్ వెల్స్ వేశామని తెలిపారు.

 ఇందిరమ్మ ఇండ్లు రానివారికి రెండో విడతలో తప్పకుండా మంజూరు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనుందని తెలిపారు. కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిఉల్లా, పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, ఇసాక్, మాణిక్యం, ఇందయ్య, దుమ్మల్ల రమేశ్, రాజన్న యాదవ్, రియాజొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.