ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్, బోయవాడ కాలనీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మెస్రం భాగ్యలక్ష్మితో కలిసి ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రోడ్లు, డ్రైనేజీలతోపాటు బోర్లను వేశామని తెలిపారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు అద్దె బస్సులు, వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అరికిల్ల పరమేశ్వర్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు బిరుదుల లాజర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్బాల్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
