బలహీన వర్గాలకు కాంట్రాక్టులు అప్పగించాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బలహీన వర్గాలకు కాంట్రాక్టులు అప్పగించాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని.. ఆ ప్రాజెక్టుతో ఆంధ్ర కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా వాటర్ ను తెలంగాణ ప్రజలకు దక్కకుండా కేసిఆర్ ఆంధ్రకు దోచి పెట్టారని విమర్శించారు. ఆంధ్రవాళ్లు మన నీళ్లను దోచుకుంటున్నారని V6 , వెలుగు అనేక కథనాలు ప్రసారం చేస్తే..కేసీఆర్ దానిమీద స్పందించకుండా.. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన వీ6, వెలుగును బ్యాన్ చేశారని గుర్తు చేశారు. కృష్ణా వాటర్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వివేక్.

గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఆంధ్రా వాళ్లకే కాంట్రాక్టులు అప్పగించారని చెప్పారు. తెలంగాణలోని SC ST BCలకు కాంట్రాక్టులు అప్పగించాలని...SC ST BC వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆయన కోరారు.

రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ అడ్డగోలుగా దోచుకున్నారని.. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం మూడో టీఎంసీకి పరిపాలన అనుమతిలిచ్చి నిధులు విడుదల చేయడంపై ప్రభుత్వం ఎంక్వయిరీ జరపాలని ఎమ్మెల్యే వివేక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.