చెన్నూరు మండలంలో ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు

చెన్నూరు మండలంలో ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి కష్టాలు

చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలంలోని శివలింగాపూర్, అక్కేపెల్లి, బావురావుపేట, గంగారం, సుద్దాల, లింగంపెల్లి, ఎర్రగుంటపెల్లిలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. నీటి కోసం అవస్థలు పడుతున్నామని, బోరు వేసి తమ కష్టాలు తీర్చాలని ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఈ గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే బోర్లు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు అధికారులు ఆది, సోమవారాల్లో ఆయా గ్రామాల్లో బోర్లు వేశారు. దీంతో ఇన్నాళ్లు తాము పడ్డ కష్టాలు తీరాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో మోహన్, ఆర్​డబ్ల్యూఎస్​ డీఈ విద్యాసాగర్, చెన్నూరు మండల కాంగ్రెస్ నేత అయిత హేమవంతరెడ్డి, నాయకులు తాటి శ్రీనివాస్, భాస్కర్ గౌడ్, రాజ్ కుమార్, రాములు, రమేశ్​ పాల్గొన్నారు.