పేదలఅభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పేదలఅభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు:పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం శిల్పారామంలో నగరానికి చెందిన 3,340 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లుగా పేదలకు  బీఆర్ఎస్  ప్రభుత్వం ఒక్క రేషన్​కార్డు ఇవ్వలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సన్న బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. 

ప్రజా ప్రభుత్వం అంటేనే సంక్షేమం అనేలా పాలన ఉందన్నారు. అనంతరం 1,500 మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్  అందజేశారు. ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్  బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్  చైర్మన్  పెద్ద విజయ్ కుమార్, టీపీసీసీ సెక్రటరీ సంజీవ్  ముదిరాజ్, వినోద్ కుమార్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, ఆనంద్ గౌడ్, ఎన్పీ వెంకటేశ్, మారేపల్లి సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ, వసంత, సీజే బెనహర్ పాల్గొన్నారు.