ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారిస్తే ఊరుకోను : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారిస్తే ఊరుకోను : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
  •     ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హెచ్చరిక 
  •     కమలాపురం ఏహెచ్ఎస్ ఆకస్మిక తనిఖీ

ములకలపల్లి, వెలుగు : ప్రభుత్వం గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం ఎంతో ఖర్చు చేస్తోందని, ఈ క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలను నీరు కారిస్తే ఊరుకోనని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారులను హెచ్చరించారు. మండలంలోని కమలాపురంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

హాస్టల్ నిర్వహణ పట్ల వార్డెన్ రామదాసుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకుమె నూ ప్రకారం భోజనం అందించాలని, నాసిరకం కూరగాయలు, సరుకులు వాడితే తగిన చర్యలు తీసుకుంటానని, చికెన్, మటన్ క్వాంటిటీలో తేడా రావద్దని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట పలువురు  అధికారులు ఉన్నారు.