ఎమ్మెల్యేలు లాంగ్ జంప్ చేసి ఊర్లలో అడుగుపెట్టాలె

ఎమ్మెల్యేలు లాంగ్ జంప్ చేసి ఊర్లలో అడుగుపెట్టాలె

పోలీస్ ఈవెంట్స్లో అభ్యర్థులు నాలుగు మీటర్ల లాంగ్ జంప్ను ఎలా దూకుతారని ఓ యువకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చేముందు ఎమ్మెల్యేలు కూడా నాలుగు మీటర్ల లాంగ్ జంప్ చేసి రావాలన్నారు. ఒక్కో  గ్రామం నుంచి 20మంది చొప్పున ఎగ్జామ్ రాస్తే 15మంది లాంగ్ జంప్లో డిస్క్వాలిఫై అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ నియామకాల్లో ఏర్పడిన గందరగోళంపై ఇందిరాపార్క్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతలు సమర దీక్ష చేపట్టారు. దీక్షలో పోలీస్ జాబ్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. 

వారం రోజుల్లో లాంగ్ జంప్ దూరాన్ని తగ్గిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని సదరు యువకుడు హెచ్చరించారు. కేసీఆర్ తన ఇంట్లోనే ఐదు ఉద్యోగాలిస్తే..ప్రజలకు ఇంటికొక ఉద్యోగమైనా ఇవ్వాలి కదా అని యువకుడు ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించేవాళ్లకే ప్రజలు, విద్యార్థులు మద్ధతు ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. ఊరికే ధర్నాలు చేయడంలేదని.. ఉద్యోగాల కోసం చేస్తున్నామని చెప్పారు.