ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్..హరీశ్ కు బల్మూరి కౌంటర్

ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్..హరీశ్ కు బల్మూరి కౌంటర్

మాజీ మంత్రి హరీశ్ రావుక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు.  కవిత ఆరోపణలపై హరీశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రబుల్స్ షూటర్ ట్రబుల్స్ నుంచి బయటపడ్తలేరన్నారు.

కవిత ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలు  కన్ఫ్యూజన్లో ఉన్నారని విమర్శించారు బల్మూరి. కవిత ఆరోపణలపై కేటీఆర్ హరీశ్ చిత్తశుద్ది నిరూపించుకోవాలని సవాల్ విసిరారు . డిప్యూటీ సీఎం భట్టిపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించామన్నారు బల్మూరి వెంకట్.

బొగ్గు కుంభకోణం విషయం పై ఏ మంత్రి స్పందించలేదని హరీశ్ రావు అన్నారు.  ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కుంబకోణలను బయటకు తీస్తామని హరీశ్ అన్నారు. బొగ్గు కుంభకోణం గురించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డికి బొగ్గు  లేఖ రాస్తానని చెప్పారు. నైని బ్లాక్ తో పాటు అన్ని బొగ్గు టెండర్లను రద్దు చెయ్యాలన్నారు. సీఎం బామ్మర్ది అవినీతి బాగోతాన్ని బయటపెట్టినందుకే తనకు సిట్ నోటీసులిచ్చిందన్నారు.