
- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్
జూబ్లీహిల్స్, వెలుగు: గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆదివారం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సినీ పరిశ్రమకు కళంకం తెస్తున్న శ్రీకాంత్ అయ్యంగార్‌పై సినీ పెద్దలు చర్యలు తీసుకోవాలని కోరారు.
పబ్లిసిటీ కోసం పిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ పేర్కొన్నారు. క్షమాపణ చెప్పిన శ్రీకాంత్ అయ్యంగార్.. గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్లు శ్రీకాంత్ అయ్యంగార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. గాంధీపై చేసిన కామెంట్లకు ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు.