ఆ హామీలు ఇచ్చే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు

V6 Velugu Posted on Jan 18, 2022

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యనందిస్తామని చెప్పి 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడతామని చెప్పడం సంతోషమన్నారు. విద్యాలయాల్లో  మౌలిక సదుపాయాల కల్పించినప్పడే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. పిల్లల  భోజన సదుపాయాలపై కూడా  దృష్టి పెట్టాలని కోరారు. అధికారంలోకి వచ్చాక కేవలం 2017లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయుల నియమాకాలు చేపట్టారని జీవన్ రెడ్డి విమర్శించారు. గడిచిన 4 సంవత్సరాలుగా ఒక్క టీచర్  పోస్టు నియమించలేదన్నారు. ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులతోపాటు, మరో 25 వేల పోస్టులు భర్తీ చేయాలన్నారు.  

సీఎం ప్రకటనలు మాటలకే పరిమితమైతే.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినట్లేనన్నారు జీవన్ రెడ్డి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మధ్యాహన భోజన కార్మికులు సమ్మెకు పోతే ప్రభుత్వం సంబర పడుతోందన్నారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలనే చిత్తశుద్ధి ఉంటే గతంలో వేసిన తిరుపతి రావు కమిటీ నివేదికను బయటపెట్టాలన్నారు. 317 జీవోతో భార్య భర్తలను విడదీసి పాపం మూటగట్టుకుంటున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు. 317 ద్వారా ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని డైవర్ట్  చేయడానికి ఈ ప్రకటనలు చేస్తున్నారన్నారు. మహిళ యూనివర్సిటీ పేరు చెప్పి 4 ఏళ్ళు అవుతుందన్నారు జీవన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి: 

MGM లో 69మంది వైద్యసిబ్బందికి పాజిటివ్

హామీల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారు

Tagged MLC Jeevan Reddy, CM KCR, Telangana government

Latest Videos

Subscribe Now

More News