అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నరు

అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నరు

జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ హస్తం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర సర్కార్ తీరుపై ఆయన మండిపడ్డారు. అన్నదాతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సమస్యను పరిష్కరించాలని.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వార్తల కోసం:

కిషన్ రెడ్డి సీరియస్.. వారిద్దరూ పరుగులు

హైదరాబాద్ లో రూ. 140కి చేరిన టమాట ధర