ముత్యంపేట చెక్కెర ఫ్యాక్టరీని తెరుస్తాం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 ముత్యంపేట చెక్కెర ఫ్యాక్టరీని తెరుస్తాం: ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిదారుల, నియంతృత్వ  పాలన సాగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి మండిపడ్డారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవనంలో 2023,  అక్టోబర్ 21వ తేదీ శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభను విజవంతం చేసిన కార్యకర్తలకు ధాన్యవాదాలు తెలిపారు. గడిచిన 9 సంవత్సరాల కాలంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రూ.30  నుంచి రూ. 40  వేల కోట్ల నిధులను ప్రభుత్వం దారి మల్లించిందని ఆరోపించారు. బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ లపై ప్రభుత్వని కి చిత్త శుద్ధి లేదని విమర్శించారు. 

Also Read : నీ డేర్ మామూలుదా : మొసలిని భుజాలకెత్తుకున్నాడు

బీసీల జనగణన జరిగితే జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులు కేటాయించబడి హక్కులను కాపాడగల్గుతామన్నారు. సమగ్ర కుటుంబ సర్వే బహిర్గతమైతే  బీసీల జనాభా బయటపడుతుందని చెప్పారు. ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్ అమలు కోసం రాజ్యాంగ సవరణ చేసి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముత్యంపేట చెక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో  కాంగ్రెస్  అధికారంలోకి రాగానే చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.