కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నం: జీవన్ రెడ్డి

కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నం: జీవన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముందుగా మురళీధర్ రావును తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీలు ఏకం అవుతున్నాయని అన్నారు. సీబీఐ విచారణ కన్నా.. న్యాయ విచారణ గొప్పదని అన్నారు. అందుకే పారదర్శకంగా విచారణ జరిపేందుకే...జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నామని అన్నారు జీవన్ రెడ్డి.

కాలేశ్వరం, యాదాద్రి, మిషన్ భగీరథలో 50 వేల కోట్లకు మించి అవినీతి జరిగిందని ఆరోపించారు జీవన్ రెడ్డి. న్యాయ విచారణను కాళేశ్వరానికే పరిమితం చేయొద్దు..యాదాద్రి, మిషన్ భగీరథ, భూ కేటాయింపులపై కూడా న్యాయ విచారణ  చేయాలని డిమాండ్ చేశారు.  బీసీ బందు, మైనారిటీ బందు ఇవ్వలేదని అందుకే ఓడగొట్టారన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతిలో కాలేశ్వరం ఒక భాగం మాత్రమేనన్నారు.

తెలంగాణ పదాన్ని చెరిపేసింది..ఉద్యమ లక్ష్యాలను నీరుగార్చిందే కేసీఆర్ అని మండిపడ్డారు జీవన్ రెడ్డి.  పార్టీ పేరులో తెలంగాణను తొలగించిన కేటీఆర్, కేసీఆర్.. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం హస్యాస్పదమన్నారు.