భారత్ సోలార్ సెల్స్పైనా ట్రంప్ టారిఫ్.. అన్యాయంగా సబ్సిడీలు పొందాయంటూ ఆరోపణ

భారత్ సోలార్ సెల్స్పైనా ట్రంప్ టారిఫ్.. అన్యాయంగా సబ్సిడీలు పొందాయంటూ ఆరోపణ
  • అన్యాయంగా ప్రభుత్వ సబ్సిడీలు పొందాయని భారత్‌‌‌‌‌‌‌‌, లావోస్‌‌‌‌‌‌‌‌, ఇండోనేషియాపై యూఎస్​ ఆరోపణ

న్యూఢిల్లీ: ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న సోలార్ సెల్స్​పై, ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌పై యాంటీ సబ్సిడీ డ్యూటీలను వేయాలని యూఎస్ కామర్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్ణయించింది. ఎంత రేటు విధిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఇండియా, లావోస్,  ఇండోనేషియా నుంచి దిగుమతి అయ్యే సోలార్ సెల్స్, ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌పై అన్యాయమైన ప్రభుత్వ సబ్సిడీలు  ఉన్నాయని సోమవారం నిర్ధారించింది. 

కామర్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ పరిశీలన ప్రకారం,  ఈ మూడు దేశాల్లోని కంపెనీలు అమెరికా ప్రభుత్వ సబ్సిడీలు పొందాయి.  దీంతో అమెరికన్ సోలార్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌కు  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ పడిపోయింది. అలయన్స్‌‌‌‌‌‌‌‌ ఫర్ అమెరికన్ సోలార్ మాన్యుఫాక్చరింగ్ అండ్ ట్రేడ్  ఈ మూడు దేశాల కంపెనీలకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో మొదటి దశగా తాజాగా ప్రిలిమినరీ రిపోర్ట్ విడుదలైంది.

 చైనీస్ కంపెనీలు లావోస్‌‌‌‌‌‌‌‌, ఇండోనేషియా నుంచి తక్కువ ధరకే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అమెరికాలో డంప్ చేస్తున్నాయని ఈ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఇండియా నుంచి కూడా చీప్ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాయని చెబుతోంది. గతంలో ఈ అసోసియేషన్‌‌  మలేషియా, వియత్నాం వంటి సౌత్‌‌‌‌‌‌‌‌ ఈస్ట్ ఆసియా దేశాలపై కూడా టారిఫ్స్ వేయించింది. 

ఇప్పుడు ఇండియా మీద ఫోకస్  పెట్టింది. ఈ కేసులో భాగంగా యూఎస్ కామర్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ చర్యలు తీసుకుంది.  తాజా ప్రిలిమినరీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌పై  కంపెనీలు  వాదనలు వినిపించవచ్చు.  ఇంకా ఈ మూడు దేశాల నుంచి  సోలార్  సెల్స్‌‌‌‌‌‌‌‌, ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌ తక్కువ ధరలకు  అమెరికాకు వస్తున్నాయా? అంటే ప్రొడక్షన్ కాస్ట్‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువ రేటుకు డంప్ అవుతున్నాయా? అనే అంశంపై వచ్చే నెలలో నిర్ణయం వెలువడనుంది. ఫైనల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాదిలో చివరిలో వేస్తారు.