షాద్ నగర్, వెలుగు: షాద్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్పరమేశ్వర్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈఈ), సివిల్ ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
3వ తేదీలోగా అప్లై చేసుకోవాలని, 4న ఉదయం 9:30 గంటలకు కళాశాలలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. పాలిసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు అర్హత సాధించని, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఫీజుతో రావాలని సూచించారు.
