వాహనాలతోపాటు టైర్లకు, రిపేర్లకూ లోన్లు..శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి శ్రీ ఆరంభ్ లోన్స్

వాహనాలతోపాటు టైర్లకు, రిపేర్లకూ లోన్లు..శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి శ్రీ ఆరంభ్ లోన్స్

హైదరాబాద్​, వెలుగు: శ్రీరామ్ ఫైనాన్స్ ఎస్ఎఫ్ఎల్ ట్రక్కు డ్రైవర్లు, రవాణా రంగం కోసం 'శ్రీ ఆరంభ్ లోన్స్' ప్రారంభించింది.  దీనిపై అవగాహనకు సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి ప్రారంభించింది. 

కేవలం వాహనాలకే కాకుండా టైర్లు, ఇంధనం, చలాన్లు, ఇన్సూరెన్స్, రిపేర్లకు కూడా లోన్లు ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఆరంభ్​ లోన్ల ప్రచారం కోసం ఎనిమిది భారతీయ భాషల్లో ఒక మ్యూజికల్ బ్రాండ్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. 

డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లతో పాటు హైవేలు, రవాణా కేంద్రాలు, దాబాల వద్ద కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది.