కేసీఆర్ బహిరంగ సభలతో కరోనా కేసులు పెరిగాయి

 కేసీఆర్ బహిరంగ సభలతో కరోనా కేసులు పెరిగాయి

పీఎం మోడీ, సీఎం కేసీఆర్ లకు ప్రజల ఆరోగ్యం కన్నా..రాజకీయాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రించడంలో విఫలమయ్యాయన్నారు. ఆస్పత్రిలో  బెడ్ లు లేకపోవడం.. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వుందన్నారు. పేషంట్లే ఆక్సిజన్ తీసుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
కరోనా సెకండ్ వేవ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ టైం లో అలర్ట్ కాలేదని ఆరోపించారు జీవన్ రెడ్డి. మహారాష్ట్ర లో సెకండ్ వేవ్ వ్యాపించినప్పుడే చర్యలు చేపడితే బాగుండేదన్నారు. సాగర్ ఉప ఎన్నిలను రద్దు చేసినా బాగుంటుందన్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలతో.. కరోనా కేసులు మరిన్ని పెరిగాయన్నారు. దానికి సీఎం కేసీఆర్ రే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడ్డవారికి భరోసా లేకుండా పోయిందన్నారు. ఆరోగ్య శ్రీ లేదు.. ఆయుష్మాన్ భారత్ కూడా అమలు చేయడం లేదన్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో  ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని.. చెప్పిన సీఎం.. మళ్లీ మరిచిపోయారన్నారు. 
సీఎం కేసీఆర్ కే కరోనా సోకినా.. పబ్లిక్ ను పట్టించుకునే వారే లేరన్నారు ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కు.. మంత్రి కి మధ్య కో ఆర్డినేషన్ లేదని..ఎవరికీ వారే ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతారని తెలిపారు. సాధారణ ప్రజల కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఎవరికీ తెలీదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్న జీవన్ రెడ్డి..సీఎం కేసీఆర్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు తెలిపారు.