కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది : జీవన్ రెడ్డి

కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో తప్పకుండా ఉంటానని, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తాను ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కేసీఆర్ కుట్ర కోణం ఎలా ఉందో కడియం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కేంద్రంలోని బీజేపీ పాత్ర ఉంటుందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. 

కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా ఉన్నారని,  ఏ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలు సహజంగా ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేపట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశంతో 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేసే బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లను గెలవాలన్నారు. బీజేపీ చీల్చిన ఓట్లతో జగిత్యాల స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చడంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మరో15సీట్లు తగ్గాయని, అందులో జగిత్యాల కూడా ఉందన్నారు.