పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి:ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు : పారిశుద్ధ్య కార్మికులు, కారోబార్లు నెల రోజులుగా సమ్మె చేస్తుండడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలన్నారు. శుక్రవారం మీడియా పాయింట్‌‌  వద్ద ఆయన మాట్లాడారు. 

పారిశుద్ధ్య కార్మికుల్లో 90 శాతం దళితులే ఉన్నారని, ప్రభుత్వం వారికి తక్కుత జీతం ఇచ్చి వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలగే పీఎఫ్‌‌  సౌకర్యం కూడా కల్పించాలన్నారు. కౌన్సిల్  చైర్మన్ కి పారిశుద్ధ్య కార్మికులపై వాయిదా తీర్మానం ఇచ్చామని, దానిపై చర్చ జరగాలన్నారు.