రాష్ట్ర ప్రభుత్వం తీరుతో కష్టాల్లో అన్నదాతలు

రాష్ట్ర ప్రభుత్వం తీరుతో కష్టాల్లో అన్నదాతలు

టీఆర్ఎస్ ప్రభుత్వం ఓవైపు రైతుబంధు ఇచ్చి.. మరోవైపు అన్ని రకాల ప్రోత్సహకాలను రద్దు చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. విత్తనలపై రాయితీ, యంత్రాలపై ఇచ్చే సబ్సిడీ, ఉద్యాన పంటలకు ఇచ్చే డ్రిప్ పరికరాలను ఆపేసిందని చెప్పారు. కేంద్రం ఉద్యానవన శాఖకు విడుదల చేసే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆ నిధులు తిరిగి వెళ్లిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందకుండా పోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అస్పష్ట విధానాలతో 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి తగ్గి, రూ.10వేల కోట్ల ఆదాయాన్ని రైతులు కోల్పోయారని చెప్పారు. 

కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని చెప్పారు. రైతులకు ఋణ మాఫీ రూ.2 లక్షలు ఇవ్వడం వల్ల మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సబ్సిడీ అందిస్తామన్నారు. పంటలకు బీమా పథకం అమలు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వరి ధాన్యం సేకరణ పట్ల రైతాంగం ఆందోళనకు గురవుతోందన్నారు. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ సొంత జిల్లాలో ధాన్యం కొనుగోలు జరగపోయినా పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. వరి ధాన్యం తూకంలో కోతలు విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని, దీని వల్ల అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
మరిన్ని వార్తల కోసం..

జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన

మహేశ్ డ్యాన్స్ కు ఫిదా అయిన ఫ్యాన్స్