జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన

జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమైకా పర్యటన కొనసాగుతుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా జమైకా గవర్నర్‌ జనరల్‌ సర్‌ పాట్రిక్‌ అలెన్‌ తో పాటు ఆ దేశ ప్రధాని హుల్ నెస్ తో రాష్ట్రపతి సమావేశమై ఇరుదేశాల సంబంధాలపై చర్చించారు. ఇక సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ & మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ ఆఫ్ జమైకా మధ్య సహకారంపై ఇరుదేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

అనంతరం కింగ్‌స్టన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేద్కర్ అవెన్యూనుతో పాటు  ఇండియా - జమైకా ఫ్రెండ్‌షిప్ గార్డెన్‌ ను కోవింద్ ప్రారంభించారు. అలాగే హోప్ బొటానికల్ గార్డెన్స్‌లో రాష్ట్రపతి శ్రీగంధం మొక్కను నాటారు. కాగా భారత్ - జమైకా స్నేహపూర్వక బంధాలను కొనసాగిస్తుందన్నారు కోవింద్. భౌగోళికంగా పరిమితులున్నా..పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. కరోనా కల్లోలంలో జమైకాకు భారత్ సహకారం అందించినట్లు తెలిపారు. సమాచార, సాంకేతిక, వైద్యం, ఫార్మా, క్రీడలు, పర్యాటకం రంగాల్లో జమైకాతో కలిసి ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి వెల్లడించారు. 

భారత రాష్ట్రపతి కరేబియన్ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈనెల 18 వరకు ఆయన జమైకాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ నెల 18 వరకు కోవింద్ జమైకాలో పర్యటిస్తారు. జమైకన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 


మరిన్ని వార్తల కోసం

ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చిన ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్

పులి కూనలను అక్కున చేర్చుకున్న శునకం