ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చిన ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్

ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చిన ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్

ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎల్ఐసీ షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. అయితే ఇన్వెస్టర్లకు షాక్ ఇస్తూ భారీ డిస్కౌంట్ తో ఎల్ఐసీ షేర్లు లిస్ట్ అయ్యాయి. ఈ షేర్ ఇష్యూ ధర రూ.949 తో పోలిస్తే 8.11శాతం రాయితీతో 872 వద్ద లిస్ట్ అయింది. ఈ లెక్కన కనీసం 15 షేర్లున్న ఒక లాట్ కు 14 వేల 235 పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లకు వెయ్యి 155 రూపాయల లాస్ తప్పలేదు. ఎల్ఐసీ షేర్లు ప్రీమియంతో లిస్ట్ అవుతాయని అంతా అంచనా వేశారు. కానీ అంతర్జాతీయ పరిస్థితులు,అమెరికా, ఇండియాలో వడ్డీ రేట్ల పెంపుతో మార్కెట్లు వరుసగా డౌన్ అవుతున్నాయి. ఈ ప్రభావం ఎల్ఐసీపై కూడా పడడంతో ప్రీమియం తగ్గిపోవడమే కాకుండా షేర్లు నెగిటివ్ లో లిస్ట్ అయ్యాయి.

ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం 21వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ఐసీ ఐపీవోకు దాదాపు మూడురెట్ల స్పందన కూడా వచ్చింది. ఒక్కో షేరుపై రూ.60 రాయితీ పొందిన పాలసీదారులు వారికి కేటాయించిన విభాగంలో 6రెట్ల షేర్లకు బిడ్ దాఖలు చేశారు. అయితే ఐపీవో ఓవర్ సబ్ స్క్రైబ్ అయినా లిస్టింగ్ మాత్రం నెగిటివ్ గానే ఉంది. ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు ఒక షేరుపై రూ.60 డిస్కౌంట్ వచ్చినా నష్టం మాత్రం తప్పలేదు. అయితే దీర్ఘకాలంలో ఎల్ఐసీ లాభాలిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

 

మరిన్ని వార్తల కోసం

అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్ 2 ... కానీ ఓ నిబంధన.. !

10రోజుల పాటు కేటీఆర్ విదేశీ టూర్