సీబీఐ,ఈడీ దాడులకు భయపడం:ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

సీబీఐ,ఈడీ దాడులకు భయపడం:ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీబీఐ, ఈడీ దాడులకు భయపడబోమన్నారు. దర్యాప్తు సంస్థలకు భయపడేది ఈటల రాజేందర్ మాత్రమే అన్నారు. దొంగతనంగా సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల రాజేందర్ బీజేపీలోకి  వెళ్లింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పండించిన పంటను కేంద్రం ఎందుకు కొనడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. 

పేదల నడ్డి విరిచే విధంగా నిత్యావసర ధరలను అమాంతం పెంచేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రూ.1200 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను ఎందుకు తగ్గించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.