స్వరం మార్చిన ఎమ్మెల్సీ  కవిత

స్వరం మార్చిన ఎమ్మెల్సీ  కవిత
  • కవిత నోట ‘తెలుగు’ మాట
  • స్వరం మార్చిన ఎమ్మెల్సీ 
  • హాట్​ టాపిక్ గా మారిన కామెంట్స్​ 

హైదరాబాద్:  నిన్నటి దాక తెలంగాణ అస్తిత్వం, సాంప్రదాయంపై గొంతెత్తిన ఎమ్మెల్సీ కవిత అనూహ్యంగా స్వరం మార్చారు. తెలుగు సంస్కృతి అంటూ కొత్త రాగం అందుకున్నారు. టీఆర్ఎస్​.. బీఆర్ఎస్​ గా మారడం.. పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ఆ పార్టీ విస్తరించాలని చూస్తున్న విషయం తెలిసిందే. దీంతో కవిత మాటల్లో మార్పు వచ్చింది. సంక్రాంతి తెలుగు ప్రజలకు పెద్ద పండుగ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  ఇవాళ.. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకల్లో  నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శన, ఒగ్గు కళాకారుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. బోగీ మంటలను వెలిగించారు. అనంతరం మాట్లాడిన ఆమె..  తెలంగాణ జాగృతి.. భారత జాగృతిగా మారిన తరువాత  మొదట కార్యక్రమంగా  సంక్రాంతి లాంటి పెద్ద పండుగ  రావడం గర్వకారణమన్నారు. సంక్రాంతి అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు నిలువటద్ధమని చెప్పారు.  పాత ఆలోచనలను బోగి మంటలలో వేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.