కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి : ఎమ్మెల్సీ కవిత
  • కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి
  • సనాతన ధర్మాన్ని అవమానిస్తే రాహుల్ స్పందించలే
  • డీఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుండ్రు
  • తెలంగాణలో హామీలు అమలు చేయకుంటే పోరాడుతం
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉందన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్‌ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే నేతలు దేశాన్ని విచ్చినం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్‌ ఎందుకు అదుపు చేయడం లేదన్నారు. 

ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏంటో రాహుల్‌ గాంధీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. హిజాబ్‌ వివాదంపై కూడా రాహుల్‌ తన మౌనం వీడి.. తన వైఖరిని వెల్లడించాలన్నారు. కాంగ్రెస్‌ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడమని విమర్శించారు. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తామని, తగిన సమయంలోగా అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని కవిత వార్నింగ్‌ ఇచ్చారు.