కేసీఆర్ పాలనలోనే జగిత్యాల అభివృద్ధి : కవిత

కేసీఆర్ పాలనలోనే జగిత్యాల అభివృద్ధి : కవిత

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జైత్ర యాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమైందని అన్నారు. సీఎం ఆ జైత్రయాత్రకు మళ్లీ రావడం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి జగిత్యాలకు బయలుదేరే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఫలితం త్వరలోనే వస్తుందని కవిత ఆశాభావం వ్యక్తంచేశారు. 

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు సంతోష్ అన్న అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.